మనం ఆత్మ పరిశీలనలో పడవలిసిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. కుటుంబ సభ్యులు మిస్ కాకుండా కలిసి భోజనం చేయటం హ్యాపీ ఫ్యామిలీ ప్రధాన లక్షణమని నివేదిక వెల్లడించింది.కుటుంబ వాతావరణం హ్యాపీగా ఉండేందుకు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పటిష్టంగా ఉండేందుకు వారు ఎలా వ్యవహరించాలనే విషయంపై రెండువేల కుటుంబాల తల్లితండ్రులను ప్రశ్నించి ఈ నివేదిక రూపొందించారు. భోజనం టేబుల్ కుటుంబానికి క్యమునికేషన్ కేంద్రంగా అభిప్రాయాలు తెలుసుకునే వేదికగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని 82 శాతం మంది తల్లితండ్రులు చెప్పారట. వారంలో ఒక రోజు సెలవును ఫ్యామిలీ మిస్ చేసుకోకూడదనీ  ఎంత బిజీ ఉన్నా  వారంలో  కనీసం ఆరుగంటలు కలిసి వుండే ప్రయత్నం చేయాలనీ కలిసి కూర్చుని టీవీ లు చూడాలని కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని పిల్లల ఎదురుగా  వారించుకోకూడదని సర్వే అభిప్రాయాల్లో తేలింది. మొత్తానికి అనుభందాహాలు బతికించుకోవటానికి ప్రత్యేకం ఏవీ చేయనక్కర లేదనీ నిజాయితీగా సంతోషంగా కలిసి అన్నీ  షేర్ చేసుకోవాలని తేలింది కదా. మరి మనిల్లు  హ్యాపీ ఫ్యామిలీ యేనా ?

Leave a comment