ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒకే ఒక పండగ నూతన సంవత్సర ప్రారంభం . గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెపుతూ డిసెంబర్ 37 అర్ధ రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు జరిగే ఉత్సవారంలో ఉత్సాహంతో ప్రజలంతా పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు  అనుసరిస్తున్న కాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ . దీని ప్రకారం జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయినా చాలా దేశాలు తమ జాతీయ క్యాలెండర్ నే అనుసరిస్తుంటారు. తూర్పు ఆసియా దేశాలది చంద్ర మాసం కాబట్టి చైనా వారి కొత్త సంవత్సరం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 మధ్య కాలంలో వస్తూ ఉంటుంది. వియత్నాం లో కూడా దాదాపు ఇంతే  శ్రీలంక లో ఏప్రిల్ 13 లేదా  14 తేదీల్లో కొత్త సంవత్సరం ప్రారంభం. జపనీయులు ఇంతకు ముందు చైనీయుల కొత్త సంవత్సరమే  జరుపుకునేవాళ్ళు గానీ ఇప్పుడు జనవరి 1 నే నూతన సంవత్సరంగా మొదలుపెడుతున్నారు. అరేబియా ప్రాంతం వరకు మార్చ్ 21 న నౌరోజ్ గా  కొత్త సంవత్సరం జరుపుకుంటారు. సెప్టెంబర్ 11 న లేదా 12 న ఇథియోపియా కొత్త సంవత్సరం వస్తుంది. తెలుగు కన్నడ ల కొత్త  సంవత్సరం ఉగాది . మనం ఉగాది ని వైభవంగా జరుపుకుంటాం. జనవరి 1  నీ స్వాగతిస్తాం.

Leave a comment