కనువిందు చేసే పండుగ సంక్రాంతి వాకిళ్ళలో తీర్చిదిద్దిన ముగ్గులు గొబ్బెమ్మలు, గుమ్మడి పూల అలంకరణ గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల శ్రావ్యమైన సంకీర్తనలు ఇవన్నీ ప్రతి సంక్రాంతికి పల్లెటూర్లలో కనిపించే దృశ్యాలు. మూడు రోజుల పండుగ సంక్రాంతి భోగి, సంక్రాంతి, కనుమ అనేక విజ్ఞాన విషయాలలో కూడిన పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అన్ని మకర సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే సూర్యుడు తన వెలుగు పెంచుకొంటూ భూమాతకు వెచ్చదనాన్ని ప్రసాదిస్తాడు పంట ఇంటికి వచ్చి రైతు చేతిలో పుష్కలంగా డబ్బు వచ్చి అది వ్యాపారులకు ఇతర వర్గాలకు ఆదాయం వస్తుంది కనుక కేవలం రైతులే కాక ప్రతి ఒక్కరిని ధర్మకార్యాలు చేసేందుకు సంసిద్ధంగా ఉండమని సంక్రాంతి హెచ్చరిస్తోంది. ఆధ్యాత్మికంగా చీకటి నుంచి వెలుగులోకి అడుగు పెట్టమని అంతర్లీనంగా చెబుతోంది.

Leave a comment