Categories
మార్కెట్ లలో దొరికే రెడీమేడ్ మిక్స్ లు మసాలా పొడులు రోజు వాడొద్దని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దుకాణాల్లో దొరికే ఈ మిక్స్ లు ఆయా పదార్థాలు గడ్డ కట్టకుండా ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండేందుకు రకరకాల రసాయనాలు వాడతారు. కూల్ డ్రింక్స్ లో వచ్చేందుకు కూడా కెమికల్స్ వాడతారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే వీటిని వాడతారు కనుక మరీ అంత ప్రమాదం కాదు కానీ ఈ ఉత్పత్తులను దీర్ఘకాలం వాడితే అనారోగ్యాలూ తప్పవు అని అంటున్నారు. తాజాగా ఇంట్లోనే చేసి పెట్టుకునే పోడులే ఆరోగ్యమని చిన్నపిల్లలు ఆరోగ్యానికి కూడా ఇవే శ్రేష్టమని చెబుతున్నారు డాక్టర్లు.