సముద్రతీరం తెల్లని మెత్తని ఇసుకతో,మెరిసిపొతూ ఉంటుంది. ఆ ఇసుకలో కూర్చొని ఎదురుగా పోటెత్తుతున్న సముద్రాన్ని చూడటం గొప్ప అనుభవం. కొన్ని ప్రాంతాల్లో భూగోళిక పరిస్థితులను బట్టి సముద్రాల దగ్గర ఇసుక రంగు మారుతుంటుంది ఎర్రగా,గులాబీరంగు నల్లని వర్ణాల ఇసుకలు కూడా కనిపిస్తాయి. హవాయ్ దీపం లోని కలామరు దక్షిణాదిగా ఉన్న పాపా కొలియా తీరం లో మటుకు ఇసుక ఆకుపచ్చ రంగులో వుంటుంది. ఈ బీచ్ ని మహానా బీచ్ అంటారు సముద్రపు అడుగున 50 వేల ఏళ్ళ క్రిందట ఆకుపచ్చ శంఖాల పొడి పేరుకు పోయింది. సముద్ర,అంతర్భాగాం లో అన్ని పర్వతాలు పేలి లావా విస్ఫోటనం జరిగినపుడు ఆ పొడి ఇసుకలో కలిసి పోవడం కూడా ఈ ఆకుపచ్చ రంగుకి కారణం కావచ్చు నంటున్నారు పరిశోధకులు.

Leave a comment