మేకప్ లో ఐ షాడోల కోసం గ్లిట్టర్ లను వాడతారు మొక్కల నుంచి తీసిన సెల్యులోజ్ లోనే ఈ గ్లిట్టర్ తయారు చేసినప్పటికీ అది మెరవటం కోసం సూక్ష్మమైన అల్యూమినియం ప్లాస్టిక్ రేణువులను కలుపుతారు ఈ మైక్రో ప్లాస్టిక్ తో పర్యావరణానికి ఎంతో నష్టం అని గుర్తించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పూర్తిగా భూమిలో కలిసిపోయే గ్లిట్టర్లు తయారు చేశారు. మొక్కలు పండ్లు కూరగాయల లోని రేణువులను సేకరించి దీన్ని తయారు చేశారు. ఈ మెరుపులు నెమలి, సీతాకోకచిలుకల రెక్కల పైన కనిపించే మెరుపుల ఉంటాయి. ఈ గ్లిట్టర్ల వల్ల ఎలాంటి హాని ఉండదని దీన్ని ఆహారంలోనూ పానీయాల్లో కూడా కలుపుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Leave a comment