ఈ రోజు మనం ఆనందంగా నవ్వుతూనే వుందామా!!కారణం హాసనాంబ దేవి నవ్వుతూ ఉంటుంది కదా!!
కర్నాటకలోని హసన్ అనే గ్రామంలో ఈ ఆలయం వుంది కాబట్టి హాసనాంబ అని పేరు.దీపావళి పండుగ రోజు ఆలయాన్ని మూసి వేస్తారు.ఆవు నెయ్యితో దిపారాధన చేసి, రెండు బస్తాల బియ్యంతో అన్నం వండి నైవేద్యం పెట్టి పూలతో అందంగా అలంకరించి ఆలయాన్ని మూసివేస్తారు.
మరి ఏడాదికే హసనాంబ దేవీ దర్శనం కలుగుతుంది. అది కూడా వారం రోజుల పాటు తెరవబడుతుంది.భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. దిపారాధనం అలాగే వెలుగుతూ,అలంకరించిన పూలు వాడిపోవు,నైవేద్యం పెట్టిన అన్నం ప్రసాదంగా భక్తులు స్వీకరించి దేవి ఆశీస్సులు అందుకోవడం విశేషం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం, అన్నం.

  -తోలేటి వెంకట శిరీష 

Leave a comment