భారతదేశం హస్త కళలకు ప్రసిద్ధి . ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా హస్తకళలు అభివృద్ధి చెందాయి . ఈ హస్త కళా రూపాలన్నింటిని ఢిల్లీ లోని హస్తకళా మ్యూజియం లో చూడవచ్చు . పురానా ఖిల్లాకి ఎదురుగా ఉన్నా ఈ మ్యూజియంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమాన గుజరాత్ నుంచి త్రిపుర మేఘాలయ లో లభించే హస్త కళా రూపాలు కనిపిస్తాయి . కలంకారీ ,జమానార్ ,పాష్మియా శాలువాలు ,ఇకత్ బాలుబార్ వంటి ఎంబ్రాయిడరీలు,నాగాలాండ్ లోని గిరిజన తెగల ప్రత్యేక నేతలని ఇక్కడ చూడచ్చు . లోహంతో చేసిన దీపాలు దారు శిల్పాలు కెదురు బొమ్మలు ,మట్టిపాత్రలు మట్టిబొమ్మలు మొత్తం 33 వేళా నమూనాలున్నాయి .

Leave a comment