లాక్ డౌన్ ముందు తర్వాత అని పోల్చి చూసుకోవలసిన విషయాల్లో బరువు చూసుకోవటం కూడా ఒకటి అంటున్నారు ఎక్సపర్ట్స్. వ్యాయామం లేకపోవటం ఎక్కువసేపు విశ్రాంతి గా కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే అవి పొట్ట నిండిన భావన కలిగించి ఆకలి తగ్గిస్తాయి. వీటిలో విటమిన్స్ ,మినరల్స్ ఎక్కువే ఉంటాయి. పోషకాలు ఉండే ఆకలిని తగ్గించే పదార్థాలనే స్నాక్స్ గా తీసుకోవాలి. బాదం, వాల్నట్స్, గుమ్మడి, అవిసె గింజలు, లేత కొబ్బరి, తాజా కొబ్బరి నీళ్లు చాలా మంచివి ఆహార నియమాలు, వ్యాయామం ఉంటే బరువు తగ్గే ప్రసక్తే ఉండదు.

Leave a comment