ఒకసారి తల పొడిబారిపోయి దురద పెడుతుంటుంది.షాంపులు,రసాయనాలు తలకు వేసుకునే రంగులు కూడ కారణం కావచ్చు. అలాంటప్పుడు ఆలీవ్ నూనె గోరు వేచ్చగా చేసి వేళ్ళతో తల పై బాగా మర్దన చేయాలి. రాత్రంతా అలా వదిలేసి ఉదయన్నే సాలి సిలిక్ అమ్లం ఉన్న మెడికేటేడ్ షాంపుతో స్నానం చేయాలి. అలగే జత్ మల్ పొడిని నీళ్ళలో నాననిచ్చి, ఆ నీటిని వడగట్టి ఆ నీటితో తలకు మసాజ్ చేసిన పొడిబాడటం తగ్గి దురద పోతుంది. ఆపిల్ సికార్ వెనిగర్ లో యాంటి బాక్టిరియా,యాంటి ఫంగల్ గుణలుంటాయి. దీన్ని కాస్త డైల్యుట్ చేసి తలకు పట్టించిన దురద తగ్గిపోతుంది.వారానికి ఒక్కసారి గొరు వెచ్చని కొబ్బరి నూనే తలకు పట్టించి తల స్నానం చేసిన ఈ సమస్య రాదు.

Leave a comment