సరైన దుస్తుల ఎంపికతో పాటు సరైన హీల్స్ కూడా ఎంచుకొంటేనే ఫ్యాషన్ ,సౌకర్యం కూడా. పర్ ఫెక్ట్ హీల్ ఎంచుకోకపోతే శరీర ఆకృతి కూడా సరిగా ఉండదు. అలాగే ఎముకల ఆరోగ్యం దెబ్బ తింటుంది కూడా. కొంచెం ఎత్తు తక్కువగా ఉంటే కాస్త ఎత్తు ఇవ్వగల షూ ఎంచుకోవాలి. ప్లాట్ ఫారమ్స్ ,వెడ్జెస్,సైలెట్టోస్ గ్లాడియేటర్ హీల్స్ చక్కగా సూటవుతాయి. కాస్త బొద్దుగా ఉంటే సింపుల్ హీల్స్ సరిపోతాయి హీల్స్ గల ఓపెన్ టూ షూ బాగా నప్పుతాయి. పొడవుగా సన్నగా ఉంటే అసలు హీల్సే బావుండవు అనుకొంటారు కానీ హీల్స్ ఉన్న స్ట్రాపీ సాండిల్స్ స్టిలెట్టోన్ మరింత అందంగా ఉంటాయి.

Leave a comment