పిల్లలున్న ఇళ్ళు దేవతల నిలయం అంటారు. వాళ్ళతో ఆటలాడుతూ గడిపితే ఆరోగ్యం చాలా బావుంటుంది, పిల్లలతో మంచి అనుబంధం ఉన్న తల్లితండ్రుల్లో ఒత్తిడి శాతం తక్కువగా ఉంటుందని పరిశోధికులు చెపుతున్నారు. ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి, అజీర్ణం,డిప్రెషన్ ఛాతినొప్పి వంటి లక్షణాలు దూరంగా ఉండటాన్ని పరిశోధికులు గమనించారు. అంతేగాక పిల్లలున్న తండ్రులు తమ దురలవాట్లని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. తమ దురలవాట్లు పిల్లలపైనా దృష్ప్రభావం చూపిస్తాయనే భయంతో తండ్రులు వాటికీ దూరంగా ఉంటారని వీరు గుర్తించారు. పిల్లలతో అనుబంధం ఇల్లంతా ఆనందంతో నింపుతోందని అంటున్నారు.

Leave a comment