ముఖం, చేతులపై చూపే శ్రద్ధ పాదాలపై కూడా చూపించండి అంటారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. సహజమైన వస్తువులతో ఇంట్లోనే, ప్రయత్నించినా, పార్లర్ లో చేసే పెడిక్యూర్ ఫలితాలు వస్తాయి అంటున్నారు. నిద్రపోయే ముందర కొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె వేసి పాదాలకు రాసి బాగా మర్దన చేస్తే రక్తప్రసరణ సక్రమంగా జరిగి పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి గుజ్జుతో స్పూన్ నువ్వుల నూనె పెసర పిండి పెరుగు కలిపి పాదాలకు పూసి అరగంట ఆగి కడిగేస్తే పాదాలు చక్కగా ఉంటాయి. గుప్పెడు గులాబీ రేకులు స్పూన్ ఆలివ్ నూనె నీళ్లలో వేసి మరగనిచ్చి ఆ నీళ్లు కాస్త చల్లారాక అందులో పాదాలను కాసేపు ఉంచితే స్వాంతన కలుగుతుంది. ఆ తర్వాత ప్యూమిక్ స్టోన్ తో రుద్దితే పాదాలు కోమలంగా తయారౌతాయి.

Leave a comment