కేవలం నిల్చొని ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అంటున్నారు ఫిన్ లాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. గంటలతరబడి కూర్చోవటం వల్ల శరీరంలో పోగుపడ్డ క్యాలరీలు కేవలం నిల్చోవడం వల్ల కరిగించవచ్చు అంటున్నారు. ఎక్కువ సేపు నిలబడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది దానితో గ్లూకోజ్ రక్తంలోనే ఉండి కణాలకు చేరదు. చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరిచి మెటబాలిజం సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఈ భంగిమ శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. వీలైనప్పుడల్లా లేచి నిలబడి ఉండండి అంటున్నారు పరిశోధకులు.

Leave a comment