కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకుంటేనేపూర్ణారోగ్యం వంటగది కబోర్డ్ లను వంట చేస్తూ ముట్టుకొంటూ ఉంటే తలుపుల పైన చేతుల కంటిన, నూనె మరకలు పడతాయి.ఎప్పటికప్పుడు వంట పూర్తయిన తర్వాత శుభ్రంగా తుడిచేయాలి గిన్నెలు తోమే స్క్రబ్బర్ వేడినీళ్లలో ఏరోజుకారోజు శుభ్రంగా కడిగి పొడిగా ఉంచాలి లేకపోతే అందులో బ్యాక్టీరియా చేరుతుంది.తోమిన గిన్నెలు కడిగిన వెంటనే గుడ్డతో తుడిచి పెడితే గిన్నెల పై మరకలు ఉండవు.సింక్ దగ్గర వంట గది గుమ్మం దగ్గర జారిపో కుండా నేలకు అతుక్కునేలా ఉండే డోర్ మాట్స్ వేయాలి. కూరగాయల పై తొక్కలు వంటింట్లో చెత్త వేసే డస్ట్ బిన్ ను కూడా ఏరోజుకారోజు కడిగి శుభ్రంగా పొడిగా ఉంచాలి.

Leave a comment