ఇప్పుడు వంకాయలు అనేక రంగుల్లో వస్తున్నాయి ఊదా,పసుపు,తెలుపు,నలుపు గులాబీ రంగుల్లో,రకరకాల ఆకారాల్లో దొరుకుతున్నాయి. వంకాయలో పీచు అధికం బి-1,బి-6 విటమిన్లు చాలా ఎక్కువ 100 గ్రాముల వంకాయల్లో 15 కెలోరీలు మాత్రమే ఉంటాయి ప్రత్యేకంగా ముదురు రంగు వంకాయి తొక్కలో యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవకణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రిస్తుంది మెదడు కణాల చుట్టు వుండే  కొవ్వును కాపాడుతోంది. వాటిలో పోషక విలువలు పోకుండా ఉండాలంటే సన్నని మంట పైన మూతపెట్టి నెమ్మదిగా ఉడికించాలి. ఆలా మెత్తగా మగ్గిన వంకాయ కూర రుచీ ఆరోగ్యం కూడా.

Leave a comment