మార్కెట్ లో ఇప్పుడు విరివిగా వస్తున్నాయి నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతూ నోరూరించే ఈ తియ్యని పుల్లని రుచి తో ఉండే అల్ల నేరేడు లో విటమిన్- సి ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తింటే చర్మం పై ముడతలు మొటిమలు రావు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది రక్త పీడనం సమానంగా ఉండే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది నేరేడు లో పీచు అధికం కనుక జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. కేలరీలు తక్కువ అధిక మొత్తంలో పీచు ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా అవుతాయి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల దంతాల ఆరోగ్యంగా బావుంటుంది. నేరేడు చెట్లు ఆకులు ఎండబెట్టి పొడి చేసి పండ్లు తోముకుంటే దంత సమస్యలు పోతాయి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్- సి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు ఉండటం తో నేరేడు శరీరానికి సంపూర్ణ రోగనిరోధక శక్తిని ఇస్తుంది .పండులో ఉండే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ తో పాటు నీరు కూడా ఎక్కువే కనుక దాహ శాంతికి పనికొస్తుంది. ఈ పండు పోషకాల గని అనారోగ్యాల నివారిణి .పండే కాదు చెట్టు బెరడు ఆకులు కూడా ఔషధం. నేరేడు ఆకులతో చేసిన ఔషధం బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది .

Leave a comment