ఈ చల్లని వాతావరణం సూక్ష్మ క్రిములు సంచారానికి అనువైంది. అందుకే చాలా తేలికగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా ప్రతిరోజు పరగడుపునే వేడి నీళ్లలో పసుపు కలిపి తాగాలి నిద్ర లేవగానే 30 నిమిషాలు వ్యాయామం తప్పనిసరి. తేలికగా జీర్ణం అయ్యే వెచ్చని  పదార్థాలు తినాలి.ఉదయం అల్పాహారంలో గోధుమలు, ఓట్లు, మొక్కజొన్న, బార్లీ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క లవంగాలు వేసి కషాయం తాగడం ఎంతో మంచిది. రోజంతా వేడి నీరు తాగాలి మధ్యాహ్నం భోజనంలో కూరగాయలు, అన్నం, నెయ్యి, చపాతీలు ఉండాలి.చల్లని నీళ్ళు శీతలపానీయాలు వద్దు శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.

Leave a comment