చల్లగా ఉన్న వాతావరణంలో స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న కండెలు వేడి వేడిగా తింటే బాగుంటుంది.వేడి స్వీట్ కార్న్ పైన ఉప్పు,కారం,మిరియాల పొడి చల్లి తింటే  మరింత రుచి వీటిలో క్యాలరీలు తక్కువ.వంద గ్రాముల స్వీట్ కార్న్ లో కేవలం 86 కేలరీలు ఉంటాయి.ఈ గింజల్లో డైటరీ ఫైబర్ విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.వీటిలో ఉండే ఫెరులిక్ ఆమ్లం వార్ధక్యపు ఛాయలు రానివ్వదు.అలాగే జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. స్వీట్ కార్న్ తియ్యగా ఉన్నా ఇందులోని తీపి శాతం తక్కువే ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా.

Leave a comment