కరోనా వేళ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు జీవక్రియలు మెరుగ్గా జరిగేందుకు గ్రీన్ టీ ని నిమ్మరసంలో కలిపి తాగండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వేడినీళ్ళలో గ్రీన్ టీ బ్యాగ్ ను ముంచి ఉంచాలి తర్వాత ఐస్ క్యూబ్ నిమ్మరసం తేనె వేసి కలిపితే చల్లని లెమనెడ్ గ్రీన్ టీ తయారైనట్లే. ఈ టి జీవక్రియలను వేగవంతం చేస్తుంది .నోటి దుర్వాసనను పోగొడుతుంది. నిమ్మరసం లోని విటమిన్-సి గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ టీ ఆరోగ్యాన్నిస్తుంది.

Leave a comment