పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అరటిపండుతో ఈ సమస్య పోతుంది. ఈ పండు సహజసిద్ధమైన స్కిన్ మాయిశ్చరైజర్. పాదాలు తడిలేకుండా తుడుచుకోవాలి తర్వాత అరటి పండు గుజ్జు వేసి పాదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. పాదాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఓ స్పూన్ వ్యాజిలైన్ నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లు ఉన్న చోట రాసి సాక్స్ వేసుకోవాలి. ప్రతిరోజూ పడుకునే ముందు ఇలా చేస్తే పాదాల పగుళ్లు పోతాయి.

Leave a comment