గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం లో  సమర్పుర అనే ఏడారి ప్రాంతంలో పురుషులు దాండియా నృత్యం చేస్తూ సంతోషంగా ఉంటారు.కానీ అక్కడి స్త్రీలకు ఈ నృత్యం, సంతోషం, ఇతర పురుషులతో మాట్లాడటం అన్ని నిషేధం. చివరికి అందమైన ఎంబ్రాయిడరీ పని కూడా ఈ స్త్రీలు చేయకూడదు. ఎడారిలో ఎంతో దూరం నుంచి మంచి నీరు మోసుకురావటం కోసం మాత్రమే బయటికి వెళ్లే స్త్రీలు ఆ ప్రాంతంలో ప్రతి రోజు కలుసుకోగలుగుతారు. పురుషాధికారం అడుగడుగునా అణిచివేతలతో కుంగే ఈ స్త్రీల మధ్యకి మంజరి అనే నవ వధువు వచ్చి చేరుతుంది. ఆమె భర్త సైనికుడు. పట్టణం నుంచి వచ్చిన మంజరి ఇక్కడ వుండే ఆచారాలు పద్దతుల ప్రకారం నడుచుకోవాలని భర్త ఆదేశిస్తాడు. మంజరి వారి జీవితాల్లో తెచ్చిన మార్పుతో పాటు పురుషాధిక్య ప్రపంచం లో ఏ మార్పురాలేదని ఈ సినిమా తేల్చి చెపుతోంది. సినిమా కథ 1975 ప్రాంతానికి అయిన 21 వ శతాబ్దం లో కూడా చాలా మంది గ్రామీణ మహిళల వాస్తవిక జీవితం ఇదే. సినిమా తప్పకుండ చూడండి.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment