Categories
హెల్మెట్ పెట్టుకొంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది అమ్మాయిల కంప్లైంట్ . కానీ అది పెట్టుకోకపోతేనే జుట్టు ఊడిపోతుంది. హెల్మెట్ వాతావరణంలో కాలుష్యం నుంచి జుట్టును కాపాడుతుంది. నగరంలో నిత్యం ట్రాఫిక్ తో,వాయుకాలుష్యంతో జుట్టు రాలిపోతుంటాయి. అమ్మాయిదైన అబ్బాయిదైన ఈ కాలుష్యం నుంచి కాపాడు కోవటానికి జుట్టు హెయిర్ బాండ్ తో గట్టిగా ముడివేసి ఆపైన హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ని వారానికి ఒక సారి శుభ్రం చేయాలి. లేకుంటే దానిలో మట్టి తేమ ఏర్పడి ఫంగస్ వస్తుంది. జుట్టుపైన ఒత్తిడి పడకుండా జుట్టును చుట్టేసి దాని పైన హెల్మెట్ పెట్టుకోవాలి. మరీ బిగుతుగా ఉన్న హెల్మెట్ పెట్టుకొంటే కుదుళ్ళకు ఆక్సిజన్ అందక రక్త ప్రసరణ తగ్గి ఒత్తిడి ఎక్కువై బలహీనపడి పోతాయి.