భారత దేశపు తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి ప్రంజల్ బలమైన కంటిచూపుతో జన్మించిన ప్రంజల్ ఆరేళ్ళ వయసులో చూపు పోగొట్టుకున్నది తల్లిదండ్రులు ఆమెను మహారాష్ట్ర లో అంధుల కోసం ప్రత్యేకంగా నడిపే కమల మెహతా స్కూల్ లో చేర్చారు .సివిల్ సర్వీస్ ప్రంజల్ డ్రీమ్ ఆమె 2015 లో యు పి ఎస్పి పరీక్ష రాసింది ఐ ఆర్ ఏ ఎస్ లో ఉద్యోగం సంపాదించింది 2017 లో మరోసారి పరీక్ష రాసి ఐఏఎస్ కు అర్హత సాధించిన తొలి అంధ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. 2018లో మే లో కేరళలోని ఎర్నాకులం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా విధుల్లో చేరింది ఇక్కడ నుంచి తిరువనంతపురం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది ప్రంజల్.

Leave a comment