ఇష్టంగా తాగే టీ ని హెర్బల్ టీ గా మార్చుకొండి ఉత్సహాంతో పాటు అనేక అనారోగ్యాలు కూగా తగ్గిపోతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మంచి చర్మానికైనా మంచి నిద్రకైనా ఎంతో ఉపయోగపడతాయి. చాలా హెర్బల్ టీ లతో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వార్ధక్యలక్షణాలను నెమ్మదింప జేస్తాయి. ప్రీ రాడికల్స్ హాని నుంచి పరిరక్షిస్తూ కణాల వార్ధక్యాన్ని తగ్గిస్తాయి. చర్మానికి మేలు చేస్తాయి. చర్మం మృదువుగా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. హెర్బల్ టీ తాగితే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ అవుతాయి. చక్కెర స్థాయిల్ని క్రమ బద్దీకరిస్తుంది. అల్లం,తులసి పుదినా ,లెమన్ గ్రాస్ వంటివి మరిగే టీలో కలుపుకొంటే ఉత్తేజం కలుగుతుంది. ఆకులు,గింజలు,వేర్లు ఉపయోగించి హెర్బల్ టీ తయారు చేసుకొవచ్చు.

Leave a comment