శుభకార్యాలకు ప్రత్యేక సందర్భాలకు వేల రూపాయల ఖరీదైన చీరెలు కొంటుంటారు .అది వెంటనే ఉతికి కట్టుకుంటే మెరుపు, కొత్తదనం రెండు పోతాయి. వాటిని సరైన విధంగా భద్రం చేయాలి .పట్టు చీరెలు వేల ఖరీదు అవి కట్టుకొని వెంటనే ఉతక నక్కరలేదు. రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరేసి ఉంచి చక్కగా మడతలు పెట్టాలి. వీటిని మెత్తని వస్త్రంతో చుట్టి పెట్టుకోవచ్చు .కోరా, ఆర్గాంజ్, చందేరి వంటి చీరెలు చుట్టేందుకు ప్రత్యేకమైన చక్క కర్రలు బజార్లో దొరుకుతాయి. వాటికి చుట్టిన చీరెలను ముఖ్ మాల్ వస్త్రంలో చుట్టి దాచవచ్చు.   టిష్యూ ,ఫాన్సీ చీరెలు కట్టుకున్న తర్వాత ఇంట్లోనే గాలికి ఆరవేసి హాంగర్లకు తగిలించి బీరువాలో ఉంచుకోవచ్చు. వీటిని డ్రై క్లీనింగ్ కు ఇస్తేనే మెరుపు పోకుండా ఉంటాయి. అలాగే ఫ్యాన్సీ కాటన్స్ అంచులు ఉంటాయి కనుక కుదిరితే రోలింగ్ కు లేదా డ్రై క్లీనింగ్ కు ఇవ్వాలి.  చీరెలు తగిలించే హాంగర్ల చక్క వే ఉండాలి. స్టీలు హాంగర్ తుప్పు మరకలు పట్టిస్తాయి చీరెలు బీరువాల్లో ఉండల్ని అసలు వేయకూడదు ఎండబెట్టిన వేప ఆకులు పేపర్ కింద పరిచి పైన చీరెలు మడతపెట్టి ఉంచుకోవచ్చు. వేపాకులు పురుగుల్ని రానివ్వవు చీరెలు చక్కగా భద్రపరిస్తే చాలాకాలం మన్నికగా ఉంటాయి .

Leave a comment