తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది  అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో  మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదీ పాల తెలుపు అందాల తమన్నా . ఒక గుర్తింపంటూ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనిపించి అభినేత్రి చేసేసా. పెరఫార్మెన్స్ కు స్కోప్ వున్న  లేడీ ఓరియెంటెడ్ లో చేయడం మంచిదేననిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ విషయంలో సినిమా ఆలోచనల్లో మార్పురాలేదు కానీ బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు . మన వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ వుంటే మంచిదే కదా. పైగా రెమ్యునెరేషన్ బ్రహ్మాండంగా వుంటే  హ్యాపీ కదా అంటోంది తమన్నా.

Leave a comment