సిద్ధార్థ్. పి మల్హోత్రా తీసిన మంచి స్ఫూర్తిదాయక చిత్రం హిచ్ కీ. నైనా మాథుర్ అన్న టీచర్ నరాలకు సంబందించిన వైకల్యం తో ఉంటుంది. ఉన్నట్లుండి ఎక్కిళ్ళు రావటం,చేత్తో బుగ్గ కిందుగా కొట్టుకోవటం అసంకల్పితంగా చేస్తూ ఉంటుంది. ఆమెకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. చివరకు చిన్నప్పుడు చదువుకొన్న స్కూల్లో తాత్కాలిక టీచర్ గా జాయిన్ అవుతోంది. 9 th చదివే పిల్లలు కొందరు విద్య హక్కు చట్టం వల్ల ఆ కొర్పోరేట్ స్కూలు కు వస్తారు కానీ వాళ్లకు అక్కడ ఎలాటి ఆదరణ ఉండదు. అలాటి పిల్లల టీచర్ గా నైనా మాథుర్ సబ్జెక్ట్ బోధించటం కాకుండా వాళ్లస్థాయికి వెళ్లి వ్యవహార జీవితంలోంచి బోధించటం మొదలుపెడుతుంది ఆమె వైకల్యాన్ని వెక్కిరించిన ఆ పిల్లలు నెమ్మదిగా టీచర్ ను నమ్మి,చక్కని మార్కులు సాధించి ఉన్నతమైన స్థానంలో నిలబడతారు. రాణీ ముఖర్జీ నైనా మాథుర్ గా నటించింది. ఈ సినిమా తప్పకుండ చూడవలసిన మంచి చిత్రాల్లో ఒకటి.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment