ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా దేవతలు ప్రపంచం మొత్తం పరిచయం. ఉత్తరాది దక్షిణాది మధ్యనే సరిహద్దు గీతాలు ఏనాడో చెరిచేసి ఇప్పుడు హాలీవుడ్ కు పరుగులు పెట్టిన దీపికా పడుకునే వెండితెర సంచలనం. 2017 లో విడుదలవుతున్న ది రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేజ్ లో దీపికా పోషించిన పాత్ర పెద్దదే. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నుంచి ఫ్యాషన్ మోడల్ దాకా ఆ తర్వాత జాతీయ స్థాయి నటిగా అంతర్జాతీయ తారగా అంచెలంచెలుగా ప్రయాణం సాగించిన దీపికా తనకంటూ ఓ ప్రత్యేకత పొందగలిగింది. ఏడేళ్ల కెరీర్ లో ఎన్నో బాలీవుడ్ హిట్స్ ఉన్నాయి. కాక్ టెయిల్ ఓం శాంతి ఓం  ,బాజీరావ్ మస్తానీ , యే జవానీ హై దివానీ , చెన్నయ్ ఎక్సప్రెస్ వంటి హిట్స్ ఇప్పటికే ఆమె ఖాతా లో  ఉన్నాయి. ఉమెన్స్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ మ్యాగజైన్స్ కాలమిస్ట్ గా కూడా వుంది. చారిటబుల్ సంస్థలకు మద్దతు ఇచ్చే దాన గుణం ఉంది. ఆమె తీరైన ఆకారం కాంతులు చిమ్మే సౌందర్యం ఆమెను అంతర్జాతీయ వేదికలపైన ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

Leave a comment