మార్కెట్ లో దొరికే రెడీమేడ్ స్క్రబ్ లకంటే ఇంట్లో సొంతంగా తయారు చేసిన స్క్రబ్ మంచి ఫలితం ఇస్తుంది. బ్రౌన్ షుగర్ ,కళ్ళుప్పు తేనే కలిపితే మంచి స్క్రబ్ తయరవుతుంది.చర్మం పొడిబారి పోతే ఈ స్క్రబ్ చాలా బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఈ స్క్రబ్ తో మృదువుగా రుద్దితే చర్మం పై మచ్చలు లేకుండా మృత కణాలు పూర్తిగా పోయి చర్మం క్లీన్ గా కనిపిస్తుంది. పోర్స్ శుభ్రపడతాయి. అయితే దీన్ని అతిగా రుద్దితే చర్మం మరింత పొడిబారుతోంది. అలవేరా లోషన్ ,జుజుబా ఆయిల్ గల మాయిశ్చరైజర్ ని రాస్తే పెదవులు పగలకుండా ఉంటాయి.

Leave a comment