Categories
పని ఒత్తిడితో బాధ్యతలతో అందం పైన దృష్టి పెట్టే సమయం లేకుండా పోతే చర్మం నిర్జీవంగా అయిపోతుంది. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా తలకు హెర్బల్ నూనెతో మసాజ్ చేస్తే ఇది ఒత్తిడిని అదుపులో పెడుతుంది. చర్మం కాంతిగా ఉంటుంది. కప్పు బాదం నూనెలో ఐదారు చుక్కల లావెండర్ నూనె కలిపి రాస్తే ఫలితం ఉంటుంది. అలాగే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి స్క్రబ్బింగ్ అవసరం దీనికోసం రోజ్ బాత్ సాల్ట్ లేదా హెర్బల్ డీప్ క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించవచ్చు లేదా స్క్రబ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పావుకప్పు గులాబీ రేకుల ముద్ద లో స్పూన్ తేనె, పాలు, ఉలవ పిండి, పంచదార చేర్చి మెత్తగా చేయాలి దీనితో ఒంటికి నలుగు పెట్టేస్తే శరీరం పై మృతకణాలు తొలగి పోతాయి చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి.