చాలా మందికి హోమియో మందులు వాడటం అలవాటు.ఇవి దీర్ఘకాలికా వ్యాధులలకు చక్కని చికిత్స చిన్న చిన్న తెల్లని పల్చని సీసాల్లో ఉండే ఈ మందుల్ని ఎక్కుడ పడితే అక్కడ ఉంచకూడదు. యాంబర్ కలర్ గాజు సీసాలు మరీ మంచిది. ఈ మందులను సాధారణంగా మధ్యలో వేసుకోవలసి వస్తుందనే ఉద్దేశ్యంలో వెంట తెచ్చుకొంటారు. వీటిని గ్లౌజ్ బాక్స్ లో కాని కారు గేర్ బాక్స్ లో కానీ ఉంచకూడదు.నేరుగా సూర్యకాంతి తగిలిన బాగా వేడి తగిలిన పొటెన్సీ తగ్గుతుంది.సాదారణ రూమ్ టెంప రేచర్ చాలు.టీవీ సెట్ ల వద్ద కూడా ఉంచకూడదు. స్ట్రాంగ్ విఫ్స్ ,ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ ఈ మందుల పొటెన్సీని ప్రభావితం చేస్తాయి. వాడుకోగానే సీసా మూతలు గట్టిగా బిగించాలి.

Leave a comment