ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో తేనె చాలా కీలకం తేనె చర్మానికి తగినంత తేమ ఇస్తుంది.ముఖం శుభ్రంగా తుడుచుకొని కొద్దిగా తేనె అర చేతుల్లో తీసుకుని మసాజ్ చేస్తున్నట్లు ముఖానికి పట్టించి కాసేపాగి తుడిస్తే మొహం పై మురికి తొలగిపోయి మెరుస్తుంది. తేనె లోని యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మతు చేస్తాయి.ముఖం పై యాక్నే  ఉన్నచోట తేనె అద్ది పదిహేను నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. తేనె లోని  హైడ్రేటింగ్ గుణాలు వల్ల చర్మం  సిల్క్ లాగా మారిపోతుంది. వేళ్ళ కొసల బలంగా మృదువుగా ఉండాలంటే తేనె బాగా పనిచేస్తుంది. కాలివేళ్లు చేతి వేళ్ళు తేనె రాసి పది నిమిషాలు తర్వాత కడిగేయాలి.

Leave a comment