నగేష్ అనే వృద్ధుడు తన జీవనోపాధిగా వాడుకున్న జర్మన్ తయారీ యాంటిక్  కాపి  మిషన్ అంటే చాలా ఇష్టం పెంచుకుంటాడు. అది సరిగా పని చేయకపోయినా కొత్త లెన్స్ వేస్తే పూర్వం లాగా అవుతుందని ఆశ పడుతూ ఉంటాడు.ఆ భారీ మిషన్ తో ఇల్లు ఇరుకైపోయిందని దాన్ని అమ్మేద్దామని చూస్తుంటారు. కోడలు కొడుకు మనవరాలు కొడుకు నీరజ్ కు ప్రమోషన్ రాలేదని ఆరాట పడుతూ ఉంటాడు. చిన్న కొడుకు నితిన్ దుబాయ్ లో ఉంటాడు.తండ్రిని చూసేందుకు వచ్చి ఫోన్ పోగొట్టుకొని ఆ ఫోన్ ఇంకెవరో అమ్మాయికి దొరికి ఆ ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి గొంతు విని ఆమె పైన ఇష్టం పెంచుకుంటూ ఉంటాడు.మనవడు ఒక పాత భవనం లో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ ఒక కావిడి పెట్టెలో దాక్కున్న ఒక పాప ని చూసి తను ఆ పెట్టని మూసేసి ఆ పిల్లలను ఊపిరి ఆడకుండా చనిపోయేలా చేశానని బాధపడుతూ ఉంటాడు. ఇంతకీ ఆ పెట్టె కి ఉండే ఒక రంధ్రంలో నుంచి ఆ పాప బయటికి వెళ్లి పోతుంది. ఇలా ఒక ఇంట్లో ఉండే సభ్యులందరికీ తన ఒక ఇష్టం ఉంటుంది.జీవితం అన్ని ఇష్టాలకీ చోటు ఇవ్వదు. కొన్ని జ్ఞాపకాలు గానే ఉండాలి,ఉంటాయి అని చెబుతోందీ  సినిమా.
రవిచంద్ర. సి
7093440630

Leave a comment