కోవిద్ -19 విజృంబిస్తున్నా సమయం ఇది .ఈ సమయంలో వ్యక్తిగత శుభ్రత తో పాటు ఇంటినీ అద్దంలా ఉంచుకోవాలి .వంటగదిని శుభ్రంగా ఉంచితే ఆరోగ్యం .కిచెన్ ఆప్లెయాన్స్ పై దుమ్ము , ధూళి ,జిడ్డు పేరుకు పోకుండా వీటిని శుభ్రం చేయాలి . గ్యాస్ స్టవ్ పైన నూనె జిడ్డు , పొంగిన పాలు మొదలైన మరకలు పోవాలంటే స్టవ్ పైన వంట సోడా చల్లి స్పాంజ్ తో సబ్బు నీటితో తుడవాలి .వేడినీటిలో గుడ్డ ముంచి, మిక్సీ జార్ లో మోటారు శుభ్రం చేయాలి .అలాగే నాలుగు రోజులకోసారి ఫ్రిజ్ ని వంటసోడా , నిమ్మరసం మిశ్రమం లో స్పాంజ్ ని ముంచి చక్కగా తుడవాలి .ఉప్పు కలిపిన వేడినీటి తో ఫ్రిజ్ పై భాగాన్ని తుడిస్తే కీటకాలు వాలకుండా ఉంటాయి .

Leave a comment