వాతావరణ కాలుష్యం ఇంటి లోపల కూడా ప్రవేశిస్తుంది. ఒక్క పూట క్లీన్ చేయకపోయినా దుమ్ము పేరుకుపోతుంది. ఆరోగ్యం కోసం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవలసిందే వారానికి ఇక రోజు ఇంట్లో సింకులు,బాత్ రూంలు శుభ్రం చేయాలి. ఇంట్లో వాడుకొనే ప్రతి వస్తువుని వారానికోసారి స్థలం కదిలించాలి. కింద పేరుకొనే దుమ్ము పోగోట్టాలి. ఫ్రిజ్ వారానికి ఒక రోజు క్లీన్ చేయాలి. పేరుకొన్న వంటకాలు తీసేయాలి. ఇంట్లో చిన్న పిల్లలుంటే వారికి సంబంధించి సమస్తమైన వప్తువులు శ్రధ్ధగా అన్నింటినీ కవర్ చేసి దాచి ఉంచాలి. కిటికీలకు తలుపులకు ఉండే కర్టెన్స్ దుమ్ముతో నిండి ఉంటాయి.పదిహేను రోజులకు ఒకసారి వాటి సంగతి చేడాలి. నేల శుభ్రం చేసేందుకు గాఢమైన రసాయనాలు అక్కర్లేదు. శుభ్రమైన వేడివాటర్లో బట్ట ముంచి తుడిచేస్తే చాలు క్లీనింగ్ కోసం ఉపయోగించే రసాయనాలు వాటి వాసనలు కూడా ఎలర్జీలకు కారణం అవుతాయి.

Leave a comment