ఇప్పటి చల్లని వాతావరణంలో వర్షాల రోజుల్లో ఇంట్లోకి సరైన గాలి వెలుతురు రాదు.దుర్వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు రసాయనాలు ఉన్న రూమ్ ఫ్రెష్ నర్లు వాడేకంటే లెమన్ గ్రీన్, తులసి పుదీనా వంటి సహజమైన మొక్కలు పెంచడం ద్వారా గదిలో చక్కని సువాసనలు వస్తాయి. నీళ్లలో పుదీనా, తులసి ఆకుల్ని వేసి మరిగించాలి అందులో రెండు చుక్కల నిమ్మగడ్డి నూనె వేసి కలిపి ఆ నీళ్లను ఇల్లంతా స్ప్రే చేస్తే చక్కని సువాసన వస్తుంది.ఓ ప్లాస్టిక్ డబ్బాలో వంట సోడా వేసి అందులో నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి గదిలో ఓ మూల పెడితే రోజంతా సువాసనలు వస్తూ ఉంటాయి.

Leave a comment