సంపాదన లేకపోతే భార్యకి అలుసు,సమాజంలో లోకువ అయిపోతాం అనే కాన్సెప్ట్ మారిపోయింది . ఇప్పుడు కొత్తతరం భర్తలు భార్యల కెరీర్ కి ,వారి ఆశయసాధనకు చేయి అందిస్తున్నారు . తోడుగా నిలుస్తున్నారు . భార్య ,భర్తల బంధానికి సరికొత్త భాష్యం చెపుతూ హౌస్ హస్బెండ్స్  ముందుకొస్తున్నారు . ఇది విదేశాల్లో ఉన్నాదే . ఇప్పుడు మనదేశం లోను విస్తరిస్తోంది ఉన్నతోద్యోగం చేస్తున్నా భార్య కోసం తన జాబ్ వదిలేసి పిల్లల పని ,ఇంటిపని చేసుకొంటున్నారు . సమాజం చూసే వింత చూపులు కేర్ చేయకుండా తమ దాంపత్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకొంటున్నారు . పిల్లల పెంపకంలో వాళ్ళ కి నూరు మార్కులు పడిపోతున్నాయి . ఇంటి నిర్వహణ భారం సరిగ్గా మోసేందుకు మగవాళ్ళకోసం రిజర్వడ్ ఫక్ మెన్ అన్నా కొత్త కోర్టులూ వచ్చేశాయి .

Leave a comment