పెళ్లిని మరువలేని జ్ఞాపకంగా మలచుకోవాలి అనుకుంది ఫ్యాషన్ డిజైనర్ Esther Andrews ఈమె టిక్ టాకర్ కూడా. ఆమె పెళ్ళికి తొమ్మిది నెలల సమయం ఉంది. తను ఫ్యాషన్ డిజైనర్ కనుక తన పెళ్లి డ్రస్సు,వరుడి డ్రస్సు చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉండాలనుకొంది. వెడ్డింగ్ థీమ్ ని ముందే ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా పెళ్ళి గౌన్ తయారీ మొదలు పెట్టింది. నాణ్యమైన నూలు దారం తో నాలుగు మైళ్ల పొడవైన లేడీస్ అల్లుకుంది ముందు ప్లేస్ తో అందమైన చిన్న ఎరుపు టమోటాను డిజైన్ చేసుకుంది ఒక మైలు పొడవైన లేస్ అల్లుకొంది ముందు లెస్ లో అందమైన చిన్న ఎరుపు టమాటాను ను డిజైన్ చేసుకొంది.ఒక మైలు పొడవైన పొరలు పొరలుగా రఫెల్స్ మిగతా భాగం స్కర్ట్ పొడవాటి చేతులు వి నెక్ లైన్ డిజైన్ చేసుకుంది. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎస్తర్. ప్రతిరోజూ కొన్ని గంటల పాటు కష్టపడితే ఈ డ్రస్ తయారైంది. కాబోయే వరుడికి కోసం వ్యోమగామి సూట్ ను డిజైన్ చేసింది ఎస్తర్. న్యూయార్ సిటీ సబ్ వే పైన కూర్చుని అల్లిన ఈ గౌన్ను నెటిజన్లు చూసి అభినందనలతో ఎస్తేర్ ను ముంచేశారు. వైవాహిక బంధాన్ని కూడా ప్రతి రోజూ ఇంతే చక్కగా అల్లు కోండి అని శుభాకాంక్షలు చెప్పారు. పెళ్లి గురించి కలలుకనే అమ్మాయిలు ఆ పెళ్లి రోజు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలలో మిగిలిపోవాలి అంటే ఎస్తేర్ లాగా ఏదో కొత్తగా ప్రయత్నం చేయాలి మరి !

Leave a comment