ఆడవాళ్ళలో ఏ స్థాయిలో సున్నితత్వం ఉంటుందో తేల్చే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సమాజశ్రేయస్సు కోసం స్త్రీపురుషుల ఆలోచనలు ఎలా పని చేస్తాయి అన్న అంశంపై పరిశోధన జరిగింది. ఇందులో ఇతరులకు సాయపడే విషయంలో ఆడవాళ్ళ మెదడు చురుగ్గా స్పందిస్తుందట. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో ఆడవాళ్లు కాస్త ఎక్కువగానే స్పందిస్తే ,పురుషులు తమ డబ్బు దాచుకోవటానికి మొగ్గు చూపిస్తారని పరిశోధన సారాంశం. సామాజిక రంగాల్లో మహిళలు చురుగ్గా స్పందిస్తారని తోటి వారికి సాయం చేయటంలో అనుకూలత చూపిస్తారని రికార్డు చెపుతుంది.

Leave a comment