సినిమాలకంటే బావుంటున్నాయి కొన్ని సీరీస్ .లారా దత్తా, రింకు రాజ్‌గురు అద్భుతంగా నటించిన ఈ హండ్రెడ్ సీజన్ లో ఎనిమిది  ఎపిసోడ్స్ ఉన్నాయి.నేత్ర పాటిల్ ప్రభుత్వ ఉద్యోగం లో ఉంటుంది ప్రేమించిన వాడి తో స్విట్జర్లాండ్ వెళ్లాలని  కలలు కంటుంది.ఇంట్లో ఉద్యోగం లేని, వయసు మీరిన తాత,ఒక చిన్న తమ్ముడు ఆమె బాధ్యతలు.హఠాత్తుగా ఒకరోజు తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని జీవించేందుకు ఒక వంద రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తుంది . ఈ వంద రోజులు ఎలా గడపాలి, ముఖ్యమైన కోరికలు ఎలా తెచ్చుకోవాలి. ఇది నేత్ర సమస్య ఇంకో వైపు సౌమ్య అసిస్టెంట్ కమిషనర్ ఎంత కష్టపడి పని చేసిన ఆమెకు రావలసిన పేరు ప్రఖ్యాతలు రావు.సాటి పోలీస్ ఆఫీసర్లు స్వయంగా పోలీసు ఆఫీసర్ అయిన భర్త కూడా ఆమె భాషలో ఆమెను ఐటెమ్ గర్ల్ గానే చూస్తాడు.చుట్టూ కళ్ళకు కనబడే క్రిమినల్స్ ను తను పట్టుకోగలనని ఆమె నమ్మకం అనుకోకుండా నేత్ర, సౌమ్య కలుస్తారు నేరస్తులు విషయంలో ఎలాంటి పూర్వ అనుభవాలు లేని నేత్ర సౌమ్య కలిసి క్రిమినల్స్ ను వేటాడటం కోసం చేసిన వంద రోజుల ప్రయాణం ఈ సిరీస్.

రవిచంద్ర. సి
7093440630

Leave a comment