మా పిల్లలు చాల చిన్నవాళ్లు . నేను రాస్తున్న ఈ సందేశం వాళ్ళు చదవలేరు కూడా. ఈ దుస్తుల్లో వాళ్ళు నన్నుగుర్తించలేరు.  ఈ మహమ్మారి చేతిలో నేను ఓడిపోయి వారికీ దూరమై పోతే వాళ్ళకి నేనో విషయం చెప్పదలచుకొన్నా . మీ అమ్మ తన ధర్మం నిర్వర్తించటం కోసం చాల కష్ట పడిందని ….. ఈ మాటలు న్యూయార్క్ చెందిన డాక్టర్ కార్నెలియా గిగ్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ డాక్టరమ్మ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. డాక్టర్ల త్యాగాలను ప్రపంచం ముందుకు తీసుకు వచ్చిందీ ట్వీట్. కొన్ని నెలలుగా తన పిల్లలకు దూరంగా ఉన్నఈ డాక్టరమ్మ లాగే ఎంతో మంది ఈ కష్ట సమయంలో ప్రజల కోసం పని చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు.

Leave a comment