నాకు నచ్చని పని నాకు ఎంత లాభం తెచ్చేదైనా నేను చేయలేను వెంటనే “నో “అనేస్తాను . ఈ మధ్య ఒక ఫ్యాషన్ దుస్తుల ప్రచారానికి అంబాసిడర్ గా ఒక అవకాశం వచ్చింది . కానీ నాకెందుకో చేయలని పించలేదు . కోటి రూపాయిల ఆఫర్ . కానీ వద్దన్నాను అంటోంది సాయి పల్లవి . సాధారణంగా ఎవరైనా వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా దుస్తులు,నగలు ఫ్యాషన్ పోకడలు అనుకరిస్తారు . ముఖ్యంగా నా
అభిమానులకు మీరు ఫలానావి వేసుకొంటే బావుంటారు అని  రాంగ్ ఆలోచనని ఇవ్వలేకపోయాను . అసలా ఫ్యాషన్ దుస్తులు ,ఫెయిర్ నెస్ క్రీమూల ప్రచారాలు నాకు ఇష్ఠం లేదు . నేను వేసుకోనివి ,నాకే నచ్చనివి మీరు వేసుకోండి అని నా అభిమానులకు చెప్పటం ఏమిటి ?అది ఎంత లాభం తెచ్చిన వద్దనుకున్నా అంటోంది సాయి పల్లవి .

Leave a comment