ఈ తోటపనితో ఎంతో ఆనందం పొందుతున్ననో చెప్పలేను పచ్చని మొక్కల మధ్యని గడపడంతో మానసిక ఒత్తడి అంటూ ఏమీ లేదు.ఖాళీ సమయం మొత్తం పచ్చని మొక్కల మధ్య నే గడిపేస్తున్నాను అంటోంది జుహీ చావ్లా.తన అందం అభినయంతో వెండితెర వేల్పులా వెలిగిన జుహీ చావ్లా ఈ కరోనా సమయంలో మట్టి తో స్నేహం మొదలు పెట్టింది. తన ఇంటి చుట్టూ ఉండే స్థలంలో కూరగాయలు పండ్ల మొక్కలు పెంచుతోంది. సేంద్రీయ పద్ధతిలో చేసే ఈ సాగు ఎంతో ఆరోగ్యం అని చెబుతోంది కాస్త చోటు ఉన్న కుండీల్లో అయినా ఆకుకూరలు పెంచండి. ఈ కరోనా సమయంలో అవి ఆరోగ్యాన్నిస్తాయి అంటోంది జుహీ చావ్లా.

Leave a comment