వయసయిపోతుంది ఏం చేస్తాం అనుకొటారు కానీ 92 సంవత్సరాల వయసులో అన్నీ బాధ్యతలు తీరిపోయాక ,చిన్నప్పుడు బడికి వెళ్ళలేకపోయిన కోరికని తీర్చుకుంది గ్వాడెలూస్ ఏలాసియో .ఈమెది మెక్సికో . చిన్న తనంలో పెదరికం వల్ల బడికి వెళ్ళలేదు. ఇంట్లో పనులు ,పోలం పనులు , అన్నీ బాధ్యతలు తీరాక పెద్దవాళ్ళకు చదువు చెప్పే కార్యక్రమంలో భాగమైన ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఇప్పుడు 96 ఏళ్ళు ఈమెకు. ఇప్పుడు హైస్కూల్ లో చేరింది. హైస్కూల్ చదువు తన వందో పుట్టిన రోజుకి పూర్తి చేసేస్తానని ఎంతో ధైర్యంతో ,నవ్వుతు చెపుతుందామే. ఈమెను ఎంతో మంది ఫాలో అవుతారు.

Leave a comment