అమ్మాయిలు నాజూగ్గా సుకుమారంగా ఉండాలని భావించే రోజులు కావు ఇవి. ఎంతో శ్రమతో కూడిన వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎంచుకుంటున్నారు మంగళగిరి కి చెందిన షేక్ సాదియా అల్మాస్ కు పవర్ లిఫ్టింగ్ జాతీయ ఛాంపియన్ అయిన తండ్రి సంధాని స్ఫూర్తి. 2017 లో పదవ తరగతి లోనే సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. గత సంవత్సరం డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో 57 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. నా లక్ష్యం ఐ.పి.ఎస్ అసలు అందుకే దేహదారుఢ్యం కోసం ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టాను అంటుంది సాదియా. కామన్వెల్త్ ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తాను అంటోంది సాథియా.

Leave a comment