ఒకవైపు సినిమాల్లో పని చేస్తూనే ఇంకోవైపు చదువుకుంటాం రెండింటిలోనూ పేరు తెచ్చుకోవాలని అనుకోవటంతో తీవ్రమైన ఒత్తిడి ఉండేది రెండింటిలోను విజయం సాధించడం ఎంతో కష్టం. చదువు నా చేతిలో పని, కానీ సినిమాలో ప్రేక్షకులు నిర్ణయిస్తారు వాళ్లని మనం ప్రత్యేకంగా ప్రభావితంచేయలేము.వాళ్లకు నచ్చాలి. కరోనా సమయంలో విశ్రాంతిగా ఉండి ఈ విషయం అర్థం చేసుకోగలను అంటోంది మలయాళ నటి మాళవిక గతంలో చదువు, వృత్తి నీ సమానంగా సక్సెస్ చేయాలని ఎంతో శ్రమపడి దాన్ని దాని ప్రభావం నా హార్మోన్ల పై పడేది కోపం దుఃఖం నిరాశ కలిగేవి. సరిగ్గా నిద్ర కూడా పోయేదాన్ని కాదు ఇప్పుడు అన్నింటినీ కాస్త తేలిక గా తీసుకోవడానికి అలవాటు పడుతున్నా. నేను నవ్వుతూ ఉంటాను నిజ జీవితంలో. ఇప్పుడు మళ్ళీ ఆ నవ్వుల్ని తిరిగి తెచ్చుకున్న అంటోంది మాలవిక.
Categories