పార్లే ఆగ్రో సంస్థ జాయింట్  మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యాపారంలో ఉన్నారు నాడియా చౌహాన్.ముందు నుంచే మార్కెటింగ్ విభాగంలో పని చేశారు.నాదైన ప్రత్యేక ముద్ర కావాలనిపించింది.టెట్రా ప్యాక్ తో ఫ్రూటీ ని అందించటం మొదలుపెట్టాం.మా ఉత్పత్తుల అమ్మకాలు దూసుకు పోతున్నాయి. ముంబై లోని పార్లే విల్లే ప్రాంతానికి చెందిన చౌహాన్ కుటుంబం నుంచి వచ్చాను.1929లో మా తాతగారు బిస్కెట్లను తయారుచేసే సంస్థను స్థాపించారు.అందులోంచి వేరువేరు సంస్థలు వచ్చాయి అందులో పార్లే ఆగ్రో సంస్థ మా నాన్న ప్రకాష్ చౌహాన్ తీసుకున్నారు. నిజానికి ఒక కొత్త సంస్థను స్థాపించడం కంటే ఇప్పటికే పేరున్న సంస్థ ను ముందుకు నడిపించడం పెద్ద సవాల్ అని పించింది అంటారు నాడియా చౌహన్.

Leave a comment