గర్భం ధరించాక నాలుగో నెలనుంచి ఒక రోజుకి అదనంగా సగటున 350 కేలరీల ఆహారం  తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు . కాబోయే తల్లి చురుగ్గా పనులు చేసుకుంటూ ఆరోగ్యాంగా ఉండాలన్న ఆ సమయంలో కొన్న పోషకాలు కావాలి. కానీ అది కూడా అదనంగా తీసుకునే 350 క్యాలరీల్లోనే అందేలా చూసుకోవాలంటున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ మనకు రకరకాల పదార్ధాలు తినాలని కోరుకుంటుంది కానీ జంక్ ఫుడ్ ఎక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి మితంగా తినాలంటారు. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్దీ కొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. రెండు పూట్లా భోజనం తో పాటు రెండు మూడు విడతలుగా చిరు తిండ్ల అందులో పాలు పెరుగు గుడ్లు పనీర్ సెనగలు పెసలు బొబ్బర్లు ఇలా ఎన్నో వెరైటీస్ కలిసి తీసుకోవాలి . 350 కేలరీలు అంటే 300 గ్రాములు అదనంగా  అన్నం ఒక చిన్న చపాతీ ఒక గుడులు ఒక పండు కలిపి తీసుకున్నంత ఆహారం. మామూలుగా తినేదానికి ఈ మాత్రం చేర్చి తింటే బిడ్డకు తల్లికి సంపూర్ణ పోషకాలు అందుతాయి.

Leave a comment