ఏ దారి లేదు అనుకున్నప్పుడు ఈ మిల్లు దారి చూపింది. మా చదువు కొనసాగేందుకు సాయం చేసింది మా అక్క చెల్లెళ్ళం చదువుకున్నాం అంటుంది నివేదా.ఎం. తమిళనాడులోని కోయంబత్తూరు లో కే పి ఆర్ మిల్స్ లో పనిచేస్తున్నారు అక్క చెల్లెలు ముగ్గురు. యాజమాన్యానికి విద్యాసంస్థలు ఉన్నాయి తన సంస్థలో పనిచేసే యువతులకు కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించారు. ఆ వస్త్రాల మిల్లు లో ఆపరేటర్ గా పని చేస్తూ రాత్రివేళ చదువుకున్నారు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుంచి బి సి ఏ పూర్తి చేసి మొదటి ర్యాంక్ సాధించి చెన్నైలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ ఆర్ ఎస్ రవి చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంది నివేదా.

Leave a comment